తెలుగు భాషలోని వర్ణాలను
3 విధాలుగా విభజించారు
1.అచ్చులు
2. హల్లులు
3. ఉభయాక్షరాలు
1.అచ్చులు:
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ
ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ
ఈ అచ్చులు (i) హ్రస్వాలు,
(ii)దీర్ఘాలు అని 2 విధాలు
(i)హ్రస్వాలు:
ఒక మాత్ర కాలం లో ఉఛ్చరించే
అచ్చులను హ్రస్వాలు అంటారు
అ ఇ ఉ ఋ ఎ ఒ
(ii)దీర్ఘాలు:
రెండు మాత్రల కాలంలో ఉఛ్చరించే
అచ్చులను దీర్ఘాలు అంటారు
ఆ ఈ ఊ
ౠ ఏ ఐ ఓ ఔ
2.హల్లులు:
క ఖ గ ఘ ఙ్
చ ఛ జ ఝ ఞ్
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ శ ష స హ ళ ఱ
ఉఛ్చారణ విధానాన్ని బట్టి హల్లులను
క్రింది విభాగాలు చేశారు
1. క,చ,ట,త,ప -పరుషాలు
2. గ,జ,డ,ద,బ -సరళాలు
పై రెండింటిని అల్పప్రాణులు అని
కూడా అంటారు
3. ఖ,ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,ఫ,భ లు మహాప్రా ణాలు.
వీటిని వర్గయుక్కులు అని అంటారు.
4. ఙ్,ఞ్,ణ,న,మ అనునాసికాలు
5. య,ర,ల,వ-అంతస్థాలు
6. శ,ష,స,హ-ఊష్మాలు
3. ఉభయాక్షరాలు
ఉభయాక్షరాలు మూడు.
అవి సున్న '0'(పూర్ణబిందువు),
అరసున్న 'c",
విసర్గ 'ః'
ఈ మూడింటిని అచ్చులతోనూ,
హల్లులతోనూ ఉపయోగించడం వల్ల
వీటిని 'ఉభయాక్షరాలు’
అని వ్యవహరిస్తారు.
For below information
Visit Home Page:
https://www.telugulearning.com/p/home.html
Telugu varnalu | Telugu gunintalu |
Telugu vargaksharalu | Telugu gunintalu pronunciation |
How to use verbs in Telugu | Telugu letter pronunciation |
Telugu simple words learning through English | Telugu letter writing learning |
Telugu verbs/kriyalu | Telugu questioning words |
Telugu vatthu padaalu | Telugu ankelu |
Telugu Vatthulu | Sarala padalu |
Telugu gunintapu gurtulu | Dvitvaksharalu |
Telugu numbers | Samyuktaksharalu |
Kalamulu | Samsleshaksharalu |
Bhashabhagalu |
|
No comments:
Post a Comment